ఎడారి దేశంలో కపూర్ సిస్టర్స్ హంగామా
స్నేహితుడు ఓర్హాన్ అవత్రమణితో కలిసి విహారయాత్ర

జాన్వీకపూర్ తన దుబాయ్ ట్రావెల్ డైరీల నుండి ఫోటోషూట్ డంప్ ను షేర్ చేసింది. జాన్వీ కపూర్ – ఖుషీ కపూర్ తమ స్నేహితుడు ఓర్హాన్ అవత్రమణితో కలిసి దుబాయ్ కి విహారయాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురూ చలికాలాన్ని తమకు నచ్చినట్టుగా ఆస్వాదించినట్టు తెలుస్తోంది. జాన్వీ అలా హెడ్ స్కార్ప్ ని ధరించి హల్ చల్ చేసింది.
Kapoor sisters tour in Dubai Kapoor sisters tour in Dubai
తనతో పాటే సోదరి ఖుషీ కపూర్ ఏమాత్రం ఏ విషయంలోనూ అస్సలు తగ్గడం లేదు. జాన్వీ – ఖుషీ సిస్టర్స్ ఎడారి జీప్ పై పోజులిచ్చిన ఫోటోలు వైరల్ గా మారారు. ‘డెస్సర్ట్ ఇన్ ది డిజర్ట్ ‘ అని జాన్వీ కపూర్ కాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.
తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/