నిజామాబాద్ లో ఖిల్లా రామాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కవిత

తెరాస ఎమ్మెల్సీ కవిత బుధువారం నిజామాబాద్ లోని ఖిల్లా రామాలయాన్ని సందర్శించారు. ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, జీవన్ రెడ్డిలతో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించారు. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఈ రామాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ సందర్శించారు. అనంతరం రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మూడు నెలల పాటు ఉచితంగా భోజన సౌకర్యాన్ని తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పోటీ ప‌రీక్ష‌ల‌కు కోచింగ్ ఇస్తున్నారు. ఈ కోచింగ్ సెంట‌ర్‌ను స్థానిక ఎమ్మెల్యేతో క‌లిసి క‌విత సంద‌ర్శించారు. ఈ సందర్భాంగా ఆమె మాట్లాడుతూ..పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థులు ఎలాంటి ఆందోళ‌న‌కు గురికాకుండా, ఒక క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో చ‌ద‌వాల‌ని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు ఎంతో అన్యాయం జరిగిందన్నారు.