చంద్రబాబు మూడు బెయిల్‌ పిటిషన్లు కొట్టివేత

Chandrababu’s three bail petitions dismissed

అమరావతి: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు బిగ్ షాక్ తగిలింది. టిడిపి అధినేత చంద్రబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది.

అంగళ్లు, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. ఇది ఇలా ఉండగా, చంద్రబాబు అరెస్టుకు నెల రోజులు పూర్తి అయింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ నేటికీ నెల రోజులు అయింది.

గత నెల 9న ఉదయం 6:15 గంటలకు చంద్రబాబును అరెస్టు చేసినట్లు సిఐడి ప్రకటించింది. ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు రోడ్డు మార్గాన విజయవాడ తీసుకెళ్లారు. 10న ఉదయం 6 గంటలకు ACB కోర్టులో హాజరుపరచగా…. జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ సాయంత్రం 6:45 గంటలకు తీర్పు వెలువడింది. అర్ధరాత్రి 1:20 గంటలకు ఆయన జైల్లోకి వెళ్లారు.