శ్రీరామ నవమి సందర్బంగా ఏపీలో రాజరాజ్యమంటూ చంద్రబాబు పోస్ట్

chandrababu

నేడు శ్రీరామనవమి సందర్బంగా దేశ వ్యాప్తంగా రామ మందిరాలు కల్యాణ శోభతో ముస్తాబయ్యాయి. రాజకీయ నేతలు సైతం ప్రజలకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో టిడిపి అధినేత చంద్రబాబు చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఏపీలో రాజరాజ్యమంటూ చంద్రబాబు పోస్ట్‌ పెట్టారు. త్రేతాయుగం నాటి రామరాజ్యం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం అంటే దానికి కారణం… ప్రజల మనోభావాలకు అనుగుణంగా సాగిన శ్రీరాముని పాలన అంటూ పేర్కొన్నారు.

పాలకులు తన కుటుంబం కంటే ప్రజల ఆనందమే ముఖ్యమని భావించాలని రామ కథ చెబుతుంది. అటువంటి వారి పాలనలోనే ఊరు పచ్చగా ఉంటుంది. సమాజంలో శాంతి వెల్లివిరుస్తుందని వివరించారు. మరి కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అటువంటి సుభిక్షమైన, సుఖశాంతులతో కూడిన రామరాజ్యం నాటి పాలన అందిరావాలని కోరుకుంటూ… మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అంటూ పోస్ట్‌ పెట్టారు.