వ‌డ‌గండ్ల వాన‌తో పంటలకు తీవ్రనష్టం

రైతుల ఆందోళన

వ‌డ‌గండ్ల వాన‌తో పంటలకు  తీవ్రనష్టం
Damage to crops due to hailstorm

Amaravati: వ‌డ‌గండ్ల వాన‌తో కృష్ణా, ప‌శ్చిమ,తూర్పు గోదావ‌రి జిల్లాల‌లో వ‌రి పంట‌కు అపార న‌ష్టం వాటిల్లింది..

ఈ మూడు జిల్లాల‌లో గ‌త రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు రైతుల‌కు గుండె కోత నే మిగిల్చాయి..కోత ద‌శ‌లో ఉన్న వ‌రి పంట‌లు వ‌ర్షానికి ముంపు భారీన ప‌డ్డాయి..

దీనికి తోడు ఈదురు గాలులు తోడ‌వ‌డంతో వ‌రి పంట కంకులు చేలోనే ఒరిగిపోయాయి..

కృష్ణా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నవ‌ర్షాల‌తో . కల్లూ రు, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్, గుడివాడతో పాటు పలు ప్రాంతాల్లో జ‌ల‌మ‌యం అయ్యాయి..

వడగండ్ల వర్షం వలన పంట పొలాలు నేలకు వాలాయి. కొబ్బరి చెట్లు పడి ఇ ల్లు నేలమట్టం అయ్యాయి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/