అక్టోబర్ 7న మహాత్మా గాంధీ యూనివర్సిటీకి గవర్నర్

నల్లగొండ : గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అక్టోబరు 7న పర్యటించనున్నారు. గవర్నర్ తో పాటుగా జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం హాజరుకానున్నారు. దీనిలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌, డీఐజీ ఏవీ రంగనాథ్ సందర్శించారు. సైన్స్ బ్లాక్‌లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రక్తదాన శిబిరం ఏర్పాటు, ఆర్ట్స్ కళాశాల బ్లాక్ లో ప్రత్యేక సమావేశం యూనివర్సిటీ అభివృద్ధిపై సమీక్ష చేయనున్నారు.

యూనివర్సిటీలో జరిగే కార్యక్రమం నిర్వహణపై వీసీ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి కలెక్టర్, డీఐజీలకు వెల్లడించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు పూర్తి చేసుకొని గవర్నర్ పర్యటన విజయవంతం చేయాలని కోరారు. ఎంజీయూలోని కళాశాల నిర్మాణంలో నూతన భవనాలు తదితర అంశాలను గవర్నర్ సందర్శించనునట్లు తెలిసింది. ఇప్పటికే ఈ విషయమై వీసీ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి యూనివర్సిటీ అధికారులతో సమీక్ష చేసి అంతా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/