నేడు అమర్ నాథ్ కుటుంబీకులను పరామర్శించనున్న చంద్రబాబు

ఈ నెల 16న అమర్ నాథ్ దారుణహత్య

chandrababu

అమరావతిః తన సోదరిని వేధించవద్దని వారించిన ఉప్పాల అమర్ నాథ్ అనే విద్యార్థిని సజీవదహనం చేసిన సంగతి తెలిసిందే. సజీవదహనమైన అమర్ నాథ్ కుటుంబీకులను టిడిపి అధినేత చంద్రబాబు ఈరోజు పరామర్శించనున్నారు. మృతుడి స్వగ్రామమైన బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఉప్పాలవారిపాలెంకు ఈ మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి భరోసాను ఇవ్వనున్నారు. మరోవైపు, చెరుకుపల్లి మండలం రాజోలు వద్ద ఈ నెల 16న ఈ ఘటన జరిగింది. ట్యూషన్ కు వెళుతున్న అమర్ నాథ్ ను పాము వెంకటేశ్వరరెడ్డి, ఆయన స్నేహితులు ముగ్గురు కలిసి కొట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో అమర్ నాథ్ సజీవదహనం అయ్యాడు.