6 నుంచి చంద్రబాబు ప్రజాగళం సభలు..షెడ్యూల్ ఖరారు

Chandrababu Prajagalam Sabhas from 6th of this month

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు ఈ నెల 6వ తేదీ నుంచి ప్రజాగళం పేరుతో ప్రచార సభలు నిర్వహించనున్నారు. ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు ప్రజాగళం షెడ్యూల్ ఖరారయింది. రోజుకు రెండు నియోజకవర్గాల్లో సభలను నిర్వహించనున్నారు. 6న నంద్యాల, మైదుకూరు, 7న పామర్రు, వేమూరు, 8న పాడేరు, పలాస, 9న రామచంద్రాపురం, ప్రత్తిపాడు, 10న మార్కాపురం, ఉదయగిరి నియోజకవర్గాల్లో సభలను నిర్వహించనున్నారు. మరోవైపు ఈ నెల 4వ తేదీన రాప్తాడులో జరిగే ‘రా కదలిరా’ సభతో అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ సభలు పూర్తి కానున్నాయి. ఆ తర్వత ప్రజాగళం పేరుతో అసెంబ్లీ నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటనలను నిర్వహించనున్నారు.