రెండేళ్లుగా రాని పెన్షన్ ను చంద్రబాబు ఒక్క మాటతో ఇప్పించారు

రెండేళ్లుగా తమ బిడ్డ మానసిక, శారీరక దివ్యాంగురాలికి పెన్షన్ రావడం లేదని .. అనారోగ్యంతో బాధపడుతోందని.. తమకు ఉండేందుకు ఇల్లు కూడా లేదని ఆమె తల్లిదండ్రులు చంద్రబాబుకు విన్నవించుకున్నారు.వారి కుటుంబ పరిస్థితి చూసి చలించిపోయిన చంద్రబాబు ..అప్పటికప్పుడు రూ.25 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. అంతే కాదు ఆమెకు పెన్షన్ వచ్చేలా చూడాలని స్థానిక ఎమ్మెల్యే కు సూచించడం తో వెంటనే పెన్షన్ వచ్చేలా చూసారు. ఈ ఘటన పాలకొల్లు జరిగింది.

వివరాల్లోకి వెళ్తే..

చంద్రబాబు నాయుడు పాలకొల్లు పర్యటన సందర్భంగా తమ కుమార్తె మానసిక, శారీరక దివ్యాంగురాలని.. ఆమెకు పెన్షన్ అందడం లేదని స్వాతి తల్లి చంద్రబాబు తెలిపారు. కుటుంబ పరిస్థితి విని చలించిపోయిన చంద్రబాబు అప్పటికప్పుడు రూ.25 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆమెకు పెన్షన్ వచ్చేలా చూడాలని స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుణ్ని ఆదేశించారు. పార్టీ అధినేత ఆదేశాలతో ఎమ్మెల్యే వెంటనే స్పందించారు. మరుసటి రోజే ఆ బాలికను తన కారులో బీఎస్ఎన్ఎల్ ఆఫీసులో ఉన్న ఆధార్ సెంటర్‌కు తీసుకెళ్లి… ఆధార్ కార్డ్‌కు ఫోన్ లింక్ చేసి.. పెన్షన్ కోసం బాలికను సచివాలయానికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ట్వీట్ చేసిన టీడీపీ పార్టీ.. రామానాయుడు స్పందించిన తీరును ప్రశంసించింది. అందుకే టీడీపీ అంటే ప్రజలకు ఒక భరోసా అని పేర్కొంది.