చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దుః హైకోర్టు ఆదేశాలు

రింగ్ రోడ్డు కేసు విచారణ ఈనెల 29కి వాయిదా

chandrababu-irr-and-sand-case-court-hearing-updates

అమరావతీః అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టిడిపి అధినేత చంద్రబాబు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశించింది. మరోవైపు ఇసుక పాలసీ కేసులో కూడా చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.