చిరుజల్లుల నడమ చంద్రబాబు జెండా వందనం

స్వాతంత్ర్యం వారిచ్చిన కానుక అంటూ లోకేశ్ ట్వీట్

chandrababu

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పతాకావిష్కరణ చేశారు. తన నివాసంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. చిరుజల్లుల నడుమ జెండా వందనం సమర్పించిన ఆయన స్వాతంత్ర్య ఉద్యమ మహనీయులను స్మరించుకున్నారు. వారికి నివాళులు అర్పించారు. అటు, నారా లోకేశ్ కూడా తన కుమారుడు దేవాన్ష్ తో కలిసి పతాకావిష్కరణలో పాల్గొన్నారు. మహోన్నత దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చేందుకు పోరాడిన స్వాతంత్ర సమరవీరులు, ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుందాం అంటూ పిలుపునిచ్చారు. ఇవాళ మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం వారిచ్చిన కానుక అంటూ ట్వీట్ చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/