అమరావతి ఉద్యమానికి 800 రోజులు పూర్తి : చంద్రబాబు

అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలి

అమరావతి: ఏపీ కి ఏకైక రాజధానిగా ప్రజా రాజధాని అమరావతిని కొనసాగించాలంటూ ప్రజలు చేస్తున్న ఉద్యమానికి 800 రోజులు పూర్తయ్యాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రత్యేకంగా ఒక ప్రాంతం మీద వ్యక్తిగత కక్షను పెంచుకున్న ముఖ్యమంత్రిని దేశ చరిత్రలో మొదటిసారి చూస్తున్నామని చెప్పారు. రాజ‌ధాని ప్రాంతం శ్మశానం అన్న వాళ్లే, ఇప్పుడు అమరావతి భూముల‌ను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా మూడు ముక్కల రాజధానిని పక్కన పెట్టి అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దేశ చరిత్రలో నిలిచిపోయేలా జరుగుతున్న అమరావతి పరిరక్షణ ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/