దేశంలో కొత్తగా 14,148 క‌రోనా కేసులు

రోజువారీ పాజిటివిటీ రేటు 1.22 శాతం

న్యూఢిల్లీ: దేశంలో నిన్న 14,148 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,48,359 మంది చికిత్స పొందుతున్నార‌ని వివ‌రించింది. అలాగే, నిన్న 30,009 మంది క‌రోనా నుంచి కోలుకున్న‌ట్లు తెలిపింది.

ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,22,19,896కి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.22 శాతంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం 76.35 కోట్ల క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు. నిన్న 11,55,147 క‌రోనా ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు కేంద్రం తెలిపింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/