చంద్రబాబు కస్టడీ పిటీషన్‌పై రేపు తీర్పు

చంద్రబాబు కస్టడీ పిటీషన్‌పై రేపు శుక్రవారం ఉదయం తీర్పు వెలువడనుంది. చంద్రబాబు కస్టడీ పిటీషన్‌పై కోర్టులో వాదోప వాదనలు జరిగగా.. అనంతరం న్యాయస్థానం తీర్పును రేపు ఉదయం 10 గంటలకు వెల్లడించనున్నట్లు ప్రకటించారు.

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు నాయుడిని 5 రోజుల కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. విజయవాడ ఏసీబీ కోర్టులో బుధవారం (సెప్టెంబర్ 20) ఈ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. ఈ పిటిషన్‌పై నిన్న తీర్పు వెలువడుతుందని భావించగా.. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును గురువారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గురువారం తీర్పు వస్తుందని భావించినప్పటికీ.. తీర్పు మరోసారి వాయిదా పడింది.

చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తీర్పు వెలువరించనున్నట్టు ఏసీబీ కోర్టు జడ్డి న్యాయమూర్తి తెలిపారు. చంద్రబాబు నాయుడు క్వాష్‌ పిటిషన్‌ హైకోర్టులో ఉంది. ఈ పిటిషన్‌కు సంబంధించిన వివరాల గురించి ఏసీబీ కోర్టు జడ్జి ఆరా తీశారు. శుక్రవారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్ట్‌ అయితే, తీర్పు వాయిదా వేస్తామని, క్వాష్‌ పిటిషన్‌ లిస్ట్‌ కాకపోతే తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి తెలిపారు.