అసెంబ్లీ వద్ద ఉద్రికత్త..

తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి వీఆర్ఏలు యత్నించడంతో అసెంబ్లీ వద్ద ఉద్రికత్త వాతావరణం చోటుచేసుకుంది. గత అసెంబ్లీ సమావేశాల్లో పే స్కెల్ ప్రకారం జీతం ఇస్తామని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని, పే స్కెల్ విధానం లేకుండా ఇస్తున్న జీతం సరిపోవడం లేదని, కేవలం 12 వేల లోపే ప్రస్తుతం జీతం వస్తూండడంతో ఇబ్బందిగా ఉందని, ఇతర శాఖలో వీఆర్ఏలను భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటన చేయడంతో ఈరోజు అసెంబ్లీ ముట్టడికి వీఆర్ఏలంతా పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

తమ సమస్యలను పరిష్కరించాలంటూ అసెంబ్లీ ముట్టడికి వచ్చిన వందలాది మంది వీఆర్ఏ లను పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టు చేశారు. ఈ క్రమంలో ట్యాంక్ బండ్ వద్ద రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపిన వీఆర్ఏలను పోలీసులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తతంగా మారింది. అరెస్టు చేసిన వీఆర్ఏలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇందిరాపార్క్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ దగ్గర 200 మంది వీఆర్ఏలను ఇప్పటికే అరెస్టు చేయగా… అసెంబ్లీ పరిసర ప్రాతంలో ఉన్న రోడ్డు మొత్తాన్ని పోలీసులు బ్లాక్ చేశారు. అందులో భాగంగా నాంపల్లి నుండి అసెంబ్లీ వైపు వస్తున్న వాహనాలను దారి మళ్సిస్తున్నారు. సీఎం రూట్ అంతా పోలీసుసు క్లియర్ చేస్తున్నారు. ప్రగతిభవన్ నుంచి అసెంబ్లీ వెళ్లే రూట్ లో ఉన్న హోటల్స్, షాప్స్ ని పోలీసులు ఇప్పటికే మూసివేయించారు.