గుడివాడ బహిరంగ సభలో సీఎం జగన్ ను టార్గెట్ చేసిన చంద్రబాబు

గురువారం గుడివాడ బహిరంగ సభలో సీఎం జగన్ ను ..టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్ చేసారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని చంద్రబాబు కసిగా ఉన్నారు. మరో ఏడు , ఎనిమిది నెలల్లో ఎన్నికలు రాబోతుండడం తో ఇప్పటి నుండే బాబు ప్రజల్లో ఉంటూ అధికార పార్టీ ఫై విమర్శలు చేస్తూ..తాము అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తామో..ఏ ఏ సంక్షేమ పథకాలు అందజేస్తారో తెలియజేస్తూ వస్తున్నారు.

ఇక మూడు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శుక్రవారం గుడివాడ లో చంద్రబాబు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసారు. స్థానిక వైస్సార్సీపీ ఎమ్మెల్యే..కొడాలి నాని పై ఫైర్ అయ్యారు. గుడివాడలో రాజకీయ బిక్ష పెడితే..చరిత్ర హీనులుగా మారారన్నారు. గుడివాడలో భారీ ర్యాలీ నిర్వహించిన చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. కోడికత్తి డ్రామా కమల్ హాసన్ డ్రామా అని తాను అప్పుడే చెప్పానని గుర్తు చేసారు. కోడికత్తి డ్రామాలో టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని తేలిందని చెప్పుకొచ్చారు. ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లోనే ఇదంతా జరిగిందని పేర్కొన్నారు. ఒట్ల కోసం సానుభూతి డ్రామాగా అభివర్ణించారు. ఎన్నికల ముందు మెడలు వంచి హోదా తెస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు తాను మెడలు వంచుతున్నారని విమర్శించారు. సీఎంకే అమరావతి అంటే గిట్టదన్నారు. మూడు రాజధానులంటూ మూడు ముక్కలాటకు తెర తీసారని ఫైర్ అయ్యారు. 2004కి ముందు జగన్ ఆదాయం రూ కోటి 70 లక్షలని చెప్పారు. ఈ నాలుగేళ్లల్లో బటన్ నొక్కి 2 లక్షల కోట్లు ఇస్తే..ఆయన మంత్రులు మరో 2 లక్షలు బొక్కేసారని ఆరోపించారు.

తిరగ్గలడా:ఎన్టీఆర్ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గం గుడివాడని చంద్రబాబు గుర్తు చేసారు. అలాంటి చోట ఈ రోజు తులసి వనంలో గంజాయి మొక్కలా స్థానిక ఎమ్మెల్యే తయారయ్యాడని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఆ మొక్కను పెకిలించేద్దామని పిలుపునిచ్చారు. బూతులు మాట్లాడటం గొప్పతనమా అని ప్రశ్నించారు. అవి మాట్లాడటానికి తాను అవసరం లేదని,తమ్ముళ్లను రెచ్చగొడితే ఆ బూతులు వినలేని పరిస్థితి తీసుకొస్తారని వ్యాఖ్యానించారు. ప్రతీ ఒక్కరూ జెండా పట్టుకుని రోడ్డుపైకి వస్తే ఈ బూతుల మాజీ మంత్రి రోడ్డుపై తిరగగలడా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో సరైన రోడ్డు వేయలేని ఈ ఎమ్మెల్యే కేబరే డాన్సులు తెచ్చారంటూ ఆరోపించారు. పేకాట క్లబ్బులు తెచ్చి బాగా దండుకున్నారని విమర్శించారు. మధ్య తరగతి ప్రజలకు చెందిన ప్లాట్లు కబ్జా చేసారని ఆరోపించారు.