కోవిడ్‌ సేఫ్‌ ఇంక్యుబేషన్‌ కేంద్రాన్ని ప్రారంభించిన కిషన్‌

kishan reddy
kishan reddy

హైదరాబాద్‌: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో కొవిడ్‌ సేఫ్ ఇంక్యుబేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ..ప్రత్యేక టాక్స్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి పీఎంవోలో ప్రతి రోజు మోడి సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇతర దేశాలపై ఆధారపడకుండా భారతదేశమే వ్యాక్సిన్ అందించాలని కేంద్రం పట్టుదలగా ఉందని చెప్పుకొచ్చారు. వ్యాక్సిన్ కోసం ఇతర దేశాల ప్రధానులు చేయని ప్రయత్నం మోడి చేస్తున్నారని కేంద్రమంత్రి తెలిపారు. శాస్త్రవేతలకు మనోధైర్యాన్ని ఇవ్వటానికి ప్రధాని మోడి హైదరాబాద్‌లో పర్యటించారన్నారు. వ్యాక్సిన్ కోసం కృషి చేస్తునే.. ఇతర దేశాలతో మోడి సంబంధాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. వ్యాక్సిన్ రాగానే పంపిణీ కోసం చైన్ సిస్టం ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన వైద్యపరికరాలను తీసుకొచ్చామని… కార్మికుల కోసం అధునాతన వసతులను ఏర్పాటు చేశామన్నారు. సనత్‌నగర్ ఈఎస్ఐ 80లక్షల మంది‌ కార్మికులకు సేవలందిస్తోందన్నారు. వైద్య విద్యార్థుల ప్రాక్టికల్స్‌కు ఈఎస్ఐ మెడికల్ కళాశాల ఉపయోగకరంగా ఉందని తెలిపారు. 2019 ఏడాదికి గాను దేశంలోనే ఉత్తమ మెడికల్ కళాశాల, ఉత్తమ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఈఎస్ఐకు అవార్డులు రావటం సంతోషకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/