ట్రంప్‌ చివరి అవకాశమూ విఫలం

రిపబ్లికన్ల పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు

ట్రంప్‌ చివరి అవకాశమూ విఫలం
trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్‌ ఓటమిని అంగీకరించడం లేని విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ట్రంప్‌కు కోర్టుల్లో ఉన్న చివరి అవకాశమూ తాజాగా విఫలమైంది. అమెరికాలోని నాలుగు కీలక రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, జార్జియా, మిషిగన్‌, విస్కాన్సిన్‌లో లక్షలాది ఓట్లను రద్దు చేయాలని, ఓటింగ్‌ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందంటూ సుప్రీంకోర్టులో రిపబ్లికన్లు పిటిషన్లు దాఖలు చేశారు. అక్కడి ఎన్నికల ఫలితాల్ని నిలిపివేయాలంటూ టెక్సాస్‌కు చెందిన రిపబ్లికన్లు కోరారు. ఇందులో 126 మంది రిపబ్లికన్‌ కాంగ్రెస్‌ సభ్యులు, 17 మంది అటార్నీ జనరళ్లు చేరారు. అయితే, ఆ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

నిబంధనలకు విరుద్ధంగా ఓటింగ్‌ జరిగినట్లు ఆధారాలేమీ లేవని తేల్చి చెప్పింది. దీంతో ట్రంప్ చేస్తోన్న ప్రయత్నాల్లో ఆయన ముందున్న అన్ని దారులూ మూసుకుపోయాయని నిపుణులు చెబుతున్నారు. ఎల్లుండి ఎలక్టోరల్‌ కాలేజీ సమావేశమై తదుపరి అధ్యక్షుడిని లాంఛనంగా ఎన్నుకోనుంది. అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటికే గెలిచిన డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌ ఎంపిక లాంఛనం కానుంది.
సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/