తెలంగాణలో కేంద్ర బృందం పర్యటన

తెలంగాణలో కేంద్ర బృందం పర్యటన
Central-govt-team-visits-telangana-due-to-floods-and-rains

హైదరాబాద్‌: భారీ వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసేందకు కేంద్ర బృందం తెలంగాణలో రాష్ట్రంలో పర్యటిస్తుంది. బీఆర్కే భ‌వ‌న్‌లో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, ఉన్న‌తాధికారుల‌తో కేంద్ర బృందం స‌మావేశ‌మైంది. కేంద్ర ప్ర‌భుత్వం జాయింట్ సెక్ర‌ట‌రీ ప్ర‌వీణ్ వశిష్ట నేతృత్వంలోని ఐదుగురు స‌భ్యుల బృందం.. నేటి నుంచి రెండు రోజుల పాటు రాష్ర్టంలో ప‌ర్య‌టించ‌నుంది. హైద‌రాబాద్‌తో పాటు వ‌ర‌ద‌ల‌కు ప్ర‌భావిత‌మైన జిల్లాల్లోను కేంద్ర బృందం ప‌ర్య‌టించి నివేదిక‌ను సిద్ధం చేయ‌నుంది. పంట న‌ష్టాన్ని కూడా అంచ‌నా వేయ‌నుంది. ప‌ర్య‌ట‌న అనంత‌రం కేంద్రానికి నివేదిక స‌మ‌ర్పించ‌నుంది కేంద్ర బృందం. ఇవాళ హైద‌రాబాద్‌తో పాటు సిద్దిపేట జిల్లాలో కేంద్ర బృందంలోని స‌భ్యులు ప‌ర్య‌టించ‌నున్నారు.

కేంద్ర బృందంలోని స‌భ్యులు .. ప్ర‌వీణ్ వ‌శిష్ట‌(జాయింట్ సెక్ర‌ట‌రీ), ఆర్బీ కౌల్‌(ఆర్థిక శాఖ ప్ర‌తినిధి), కే మ‌నోహ‌ర‌న్‌( వ్య‌వ‌సాయ శాఖ డైరెక్ట‌ర్‌), ఎస్‌కే కుష్వాహా(ర‌వాణా, ర‌హ‌దారుల ఎస్ఈ), ఎం ర‌ఘురాం(జ‌ల వ‌న‌రుల శాఖ ఎస్ఈ).


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/