సురేందర్ రెడ్డి కోసం అఖిల్ అలా కనిపిస్తాడా?

సురేందర్ రెడ్డి కోసం అఖిల్ అలా కనిపిస్తాడా?

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు భాస్కర్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమా తరువాత అఖిల్ తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా ఇప్పటికే ఓకే చేశాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు అఖిల్ రెడీ అవుతున్నాడు.

ఇక ఈ సినిమాను ఏప్రిల్ 7న అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఈ సినిమా కోసం అఖిల్ సరికొత్త లుక్‌ను ట్రై చేస్తున్నాడట. ఏకంగా ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు అఖిల్ సిద్ధమవుతున్నాడట. ఇక ఈ సినిమాను ఏకంగా రూ.40 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు. అయితే ఈ అనౌన్స్‌మెంట్‌ను రెండు పోస్టర్స్‌తో చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇందులో ఒకటి షర్టు లేకుండా సిక్స్ ప్యాక్ బాడీతో అఖిల్ కనిపిస్తాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా అదిరిపోయే హిట్ కోసం అఖిల్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో, ఆ తరువాత సురేందర్ రెడ్డితో ఎలాంటి సినిమా చేస్తాడో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.