నల్లకోటు ధరించక్కర్లేదు: సుప్రీంకోర్టు

కరోనా నేపథ్యంలో..కొంతకాలం ధరించకుండా ఉండాలి..సీజే బోబ్డే ఆదేశం

supreme court

న్యూఢిల్లీ: న్యాయవాదులు కరోనా వైరస్‌ కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారానే కేసుల విచారణ జరుపుతున్నారు. అయితే సంప్రదాయ నలుపు రంగు కోట్లు, గౌన్లను ధరించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల కరోనా మహమ్మారి సమసిపోయేంతవరకూ లేదా తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకూ ఈ ఆదేశాలు అమలవుతాయని వెల్లడించింది. ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై తెల్ల చొక్కా, నెక్ బ్యాండ్ ధరించి విచారణ చేపట్టిన ఎస్ఏ బోబ్డే, సహచర న్యాయమూర్తులు, లాయర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, నలుపు రంగు కోట్లు, గౌన్ల కారణంగా కరోనా వ్యాపించే ముప్పు పొంచివున్న కారణంగా కొంతకాలం వాటిని ధరించడం మానేద్దామని అన్నారు. వైద్యుల సూచనల మేరకు న్యాయవాదులు డిజైన్లు లేని తెలుపు చొక్కాలని, మహిళలు సల్వార్ కమీజ్ లేదా తెల్ల చీరతో వాదించవచ్చని, తెలుపు రంగు నెక్ బ్యాండ్ ను ధరించాలని సూచించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/