36 ఎంఎంటీఎస్ సర్వీసుల రద్దు

దక్షిణ మధ్య రైల్వే వెల్లడి

Cancellation of MMTS services
mmts train

Hyderabad: సికింద్రాబాద్ పరిధిలో సోమవారం 36 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. . ప్రస్తుతం ఈ పరిధిలో ట్రాక్ మరమ్మత్తులు, సాంకేతిక కారణాలతో సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ప్రస్తుతం 79 సర్వీసులకు గాను 36 సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపింది. వివరాలు ఇలా వున్నాయి. లింగంపల్లి-నాంపల్లి రూట్‌లో9 సర్వీసులు, నాంపల్లి-లింగంపల్లి వైపు9, ఫలక్‌నుమా-లింగంపల్లిలో 8, లింగంపల్లి-ఫలక్‌నుమా వైపు 8, సికింద్రాబాద్‌-లింగంపల్లి మార్గంలో 1, లింగంపల్లి-సికింద్రాబాద్‌ రూట్‌లో 1 సర్వీసును రద్దు చేసినట్లుగా వెల్లడించింది.

ఆంధ్ర ప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/