మునుగోడులో ఈరోజు నుంచి బండి సంజయ్ ప్రచారం మొదలు

ఈరోజు నుంచి మునుగోడులో ప్రధాన పార్టీల ప్రచారం

Campaigning of major parties in Munugoda from today

హైదరాబాద్: మునుగోడులో ఈరోజు నుండి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ప్రచారం ప్రారంభించనున్నారు. ఆయనతో పాటు బీజేపీ నేతలు డీకే అరుణ, ఈటల రాజేందర్, బాబుమోహన్ లు ఇవాళ మునుగోడులో ప్రచారం చేస్తున్నారు. మునుగోడు స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో ఎన్నికల కమిటీలు ఎప్పటికప్పుడు ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డితో పాటు ఆయన సతీమణి లక్ష్మీ కూడా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.

టీఆర్ఎస్ నుంచి ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రచారన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ మర్రిగూడలో జరిగే సభలో మంత్రి హరీశ్ పాల్గొంటున్నారు. దాదాపు 87 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఆపార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇవాళ చౌటుప్పల్ మండంలో ప్రచారం చేయనున్నారు.

మరోవైపు కాంగ్రెస్ తరఫున పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం రోడ్ షో చేయనున్నారు. ఆయన చౌటుప్పల్ మండలంలో ప్రచారం చేస్తారు. ఇక ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఒక్క అవకాశమివ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవాళ సాయంత్రం మర్రిగూడెంలో టీఆర్ఎస్, బీజేపీ సభలు ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 4 గంటలకు సంజయ్ సభ ఉంటే.. సాయంత్రం 6గంటలకు జరిగే టీఆర్ఎస్ సభలో హరీశ్ పాల్గొంటున్నారు. అలాగే చౌటుప్పల్ మండలంలో ఉదయమంతా టీఆర్ఎస్ అబ్యర్థి ప్రచారం ఉంటే.. అవే గ్రామాల్లో సాయంత్రం రేవంత్ రోడ్ షో లు ఉండనున్నాయి. ఇప్పటికే అక్కడక్కడా పార్టీ కార్యకర్తల మద్య గొడవలు, ఒకేచోట పోటాపోటీ ప్రచారాలతో కొంత టెన్షన్ పరిస్థితులు కనబడుతున్నాయి. దీంతో ఇవాళ మర్రిగూడెంలో జరిగే ప్రచారాలపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు.