293 మందిని బలిగొన్న ట్రంప్‌ నిర్ణయం

మిల్వాకీ జర్నల్‌ సెంటినెల్‌ అధ్యయనంలో వెల్లడి

Donald Trump
Donald Trump

వాషింగ్టన్‌ : కరోనా మహమ్మారి హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ మంచి ఔషధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చాలా గట్టిగా వాదించారు.

అంతేకాకుండా భారత్‌ నుంచికూడా అధిక మొత్తంలో దానిని దిగుమతి చేసుకు న్నారు.

హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ వల్ల ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 293 మంది అమెరికన్‌లు చనిపోయారని మిల్వాకీ జర్నల్‌ సెంటినెల్‌ అధ్యయనంలో వెల్లడైంది.

ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డిఎ) వెల్లడించిన సైడ్‌ ఎఫెక్స్ట్‌ వల్ల చనిపోయిన వారి సంఖ్య ఆధారంగా ఈ అధ్యయం చేసింది. చాలామంది వైద్యనిపుణులు హై డ్రాక్సీ క్లోరోక్వీన్‌వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ చాలా ఉన్నాయని హెచ్చ రించారు.

అయినప్పటికీ ట్రంప్‌ ఈ ఔషధాన్ని వాడడంవల్ల కోల్పోయేది ఏంఉండదని ప్రకటించారు. దాంతో అందరూ వాడడం మొదలుపెట్టారు.

సాధారణం గా మలేరియా చికిత్సలోవాడే ఈ మందును గుండె జబ్బులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉండే వారు ఉపయో గించరు.

ఐతే ట్రంప్‌ ఈ డ్రగ్‌ను వాడడానికి అనుమతి నివ్వడంతో డాక్టర్లుకూడా తమ పేషెంట్లకు ఈ మందును వాడొచ్చని చెప్పారు.

దీంతో మార్చి నెలలో హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ వినియోగం ఒక్కసారిగా 2000 శాతం పెరిగింది.

ఈ డ్రగ్‌ వాడడం వల్ల 2019లో 75 మంది చనిపోతే, ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో అంతకు రెట్టింపు 293 మంది మరణించారు.

హైడ్రాక్లీ క్లోరోక్వీన్‌ ఔషధం వల్ల ఇంకా చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం :https://www.vaartha.com/specials/career/