కరోనా వ్యాప్తి..8,000 మంది ఖైదీల విడుదల
ఆగస్టు చివరి నాటికి విడుదల

శాక్రమెంటో: కాలిఫోర్నియా జైలులో శిక్ష అనుభవిస్తున్న దాదాపు 8,000 మంది ఖైదీలను ఆగస్టు చివరి నాటికి విడుదల చేస్తున్నట్లు అక్కడి ప్రభ్వుం శుక్రవారం ప్రకటించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఈ పని చేయనున్నట్లు అక్కడి జైల్ అధికారులు తెలియజేశారు. కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ ది కరెక్షన్స్ అండ్ రిహాబిలిటేషన్ ప్రకారం రాష్ట్ర జైళ్లలో అదుపులో ఉన్న 2,286 కరోనా పాజిటివ్ కేసులున్నాయని, శుక్రవారం ఉదయం 31 మంది మరణించినట్లు తెలిపారు. మొదటి విడుతలో 180రోజులు, అంతకన్నా తక్కువ శిక్ష అనుభవిస్తున్న వారిని విడిపించనున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరులోగా 4,800 మంది ఖైదీలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆరోగ్య నిపుణులు, ఖైదీల న్యాయవాదులు ఈ ప్రకటనకు హర్షం వ్యక్తం చేశారు. కాలిఫోర్నియాలోని జైళ్లలో వేగంగా కదిలే ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి ఈ చర్యలు ఇంకా సరిపోవని చాలామంది అభిప్రాయపడ్డారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/