మండిపోతున్న ఎండలు..తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం

RTC buses in Telangana
Burning sun..Telangana RTC key decision

హైదరాబాద్‌ః రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావాలంటేనే జనం హడలిపోతున్నారు. ఇక మధ్యాహ్నం సమయంలోనైతే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. నేడు, రేపు అయితే ఎండలు మరింత మండిపోతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.

మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సర్వీసులు తగ్గించాలని నిర్ణయించింది. మధ్యాహ్నం వేళ ప్రయాణికులు లేక బస్సులు ఖాళీగా తిరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో సర్వీసులు కుదిస్తున్నట్టు ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. రేపటి నుంచి బస్సుల సంఖ్యను తగ్గిస్తున్నట్టు పేర్కొన్నారు.