వైస్సార్సీపీ పార్టీ కి కొత్త పేరు పెట్టిన బుద్దా వెంకన్న

buddha venkanna
buddha venkanna

వైఎస్సార్సీపీ పార్టీ కి కొత్త పేరు పెట్టారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా రాజకీయాల్లోనూ వైస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌ న్యూడ్ వీడియో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం జగన్ సైతం సీరియస్ గా ఉన్నారు. దీనిపై టీడీపీ పార్టీ పలు విమర్శలు చేస్తూ వస్తుంది. ఈ తరుణంలో టీడీపీ నేత బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా వైస్సార్సీపీ అంటే యువ‌జ‌న శృంగార ర‌సిక చిలిపి పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. ఆ పార్టీ పేరుని సార్థ‌కం చేసే మ‌రో ట్రెండ్ సెట్ట‌ర్ ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌ అంటూ సెటైర్లు పేల్చారు.

వైఎస్సార్సీపీ ఆశీస్సుల‌తో ఇప్ప‌టి వ‌ర‌కూ అవంతి అరగంట స‌ర‌సం, అంబ‌టి గంట విర‌హం ఆడియోలు బ‌య‌ట‌కొస్తే.. వారిపై జ‌గ‌న్‌రెడ్డి ఏం చ‌ర్య‌లు తీసుకోలేదని మండిపడ్డారు. పార్టీ బ్రాండింగ్ అయిన ఇటువంటి రాస‌లీల‌లు చేయ‌డం కాదన్నారు. బ‌య‌ట‌పెట్టుకుంటేనే అధినేత గుర్తిస్తున్నార‌ని ఎంపీ గోరంట్ల మాధ‌వ్ న్యూడ్‌గా మ‌హిళ‌ని సెక్సువ‌ల్ హెరాస్ చేస్తూ వీడియో వ‌దిలారని ఆగ్రహం వ్యక్తం చేశారు బుద్దా వెంకన్న. ఇప్పుడు ఎంపీపై చ‌ర్య‌లు తీసుకుంటారో, అంబ‌టిలా ప‌ద‌వి ఇచ్చి గౌర‌విస్తారో చూద్దామని ఛాలెంజ్‌ చేశారు.

మరోపక్క గోరంట్ల మాధవ్ వీడియో ఫై పార్టీ అధినేత , ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సైతం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీ నేతల నుంచి విషయంపై ఆరా తీసినట్లు సమాచారం. ఏ క్షణమైనా మాధవ్‌ను సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో వ్యవహారం ఫై ఇప్పటికే వైస్సార్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఇది ప్రైవేటు వ్యవహారానికి చెందిన వీడియో అని, వైరల్ అయిందని అన్నారు. ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి (గోరంట్ల మాధవ్) తనపై వచ్చిన ఆరోపణలను నిరాకరిస్తున్నాడని అన్నారు. ఈ వీడియో మార్ఫింగ్ చేసినదని గోరంట్ల మాధవ్ చెబుతున్నాడని, ఒకవేళ అది మార్ఫింగ్ చేసిన వీడియో కాదని తేలితే మాత్రం అతడిపై కఠినాతికఠినమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఓ రాజకీయ పార్టీ ఎంతమేరకు చర్య తీసుకోగలదో ఆ స్థాయిలో చర్యలు ఉంటాయని వెల్లడించారు. ఆ చర్యలు అందరికీ గుణపాఠంలా ఉంటాయని అన్నారు.