బింబిసార మూవీ టాక్

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియా లో కొద్దీ సేపటి క్రితం షోస్ మొదలైనప్పటికీ విదేశాల్లో ఇప్పటికే షోస్ పూర్తి కావడంతో సినిమా చూసిన అభిమానులు సినిమా ఎలా ఉందనేది సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బ్లాక్ బస్టర్ అని చెపుతున్నారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీ వశిష్ట్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో కేథరిన్ థ్రెసా , సంయుక్త మీనన్, వారీనా హుస్సేన్ హీరోయిన్లు గా నటించగా.. వెన్నెల కిషోర్ , బ్రహ్మాజీ , శ్రీనివాస రెడ్డి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం సమకూర్చగా.. ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ నిర్వహించారు.

ఇక సినిమా టాక్ విషయానికి వస్తే..కథ క్రీస్తు పూర్వం 500 ఏళ్ల క్రితం త్రిగర్తల సామ్రాజ్యం నిధి చుట్టూ తిరుగుతుందని.. ఆ సామ్రాజ్యానికి రాజు బిసారుడుగా కళ్యాణ్ రామ్ అద్భుతంగా నటించారని చెపుతున్నారు. తన సామ్రాజ్య నిధిని కలియుగంలో ఎలా కాపాడుకున్నాడనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ సూపర్‌గా ఉందని.. విజువల్ వండర్‌లా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా గ్రాఫిక్స్ వర్క్స్ మెస్మరైజ్ చేస్తాయంటున్నారు.

బింబిసారుడు అనే క్రూరమైన రాజు.. టైం ట్రావెల్ చేసి ప్రస్తుత కాలానికి రావడం.. ఇక్కడి పరిస్థితులు చూసి ఆయనలో పరివర్తన రావడం.. ఆ తర్వాత ఆయన రాజ్యంలో ఎలాంటి పరిపాలన చేశాడు అనే నేపథ్యంతో ఈ సినిమాను చాల బాగా తెరకెక్కించారని అంటున్నారు. ఎన్టీఆర్ చెప్పినట్లు బింబిసార మూవీలో కళ్యాణ్ రామ్ తప్ప ఎవరూ చేయలేరన్నట్లు నందమూరి హీరో యాక్ట్ చేసినట్లు తెలుస్తోంది. వన్ మ్యాన్ షోగా సినిమాను మొత్తం భూజాలపై మోసినట్లు ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తే అర్థమవుతోంది. ఎంతో డెడికేషన్‌తో యాక్ట్ చేశారని.. ప్రేక్షకులను మరో ప్రపంచంలో తీసుకెళుందని ట్వీట్టర్‌లో ఆడియన్స్ రివ్యూ ఇస్తున్నారు. స్టోరీ సూపర్‌గా ఉందని.. విజువల్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్‌గా ఓ రేంజ్‌లో ఉన్నాయని పోస్టులు పెడుతున్నారు.

ఫస్టాఫ్ మొత్తం ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడానికి డైరెక్టర్ మల్లిడి వశిష్ట ఎంతో సమయం తీసుకోలేదట. కల్యాణ్ రామ్ ఇంట్రో సీన్ అదిరిపోయేలా డిజైన్ చేశాడట. ఇక, ఇంటర్వెల్ కూడా ఆకట్టుకునేలా ఉందట. ఇక, సెకండ్ హాఫ్ కూడా అద్భుతమైన వీఎఫ్ఎక్స్ సీన్లతో నడిచిందని.. ఓవరాల్ సినిమా బ్లాక్ బస్టర్ అని చెపుతుండడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.