రెండో విడ‌త అమ్మ‌కానికి తెలంగాణ ప్రభుత్వ భూములు సిద్ధం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ..ప్రభుత్వ భూములు అమ్మకానికి పెడుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర అవసరాల కోసం నిధుల సమీకరణకు ప్రభుత్వ భూములను విక్రయిస్తున్నారు. ఇప్పటికే కోకాపేట , ఖానామెట్‌ వంటి చోట్ల ప్రభుత్వ భూములను అమ్మకం చేయగా..ఇప్పుడు రెండో విడ‌త గా ఖానామెట్‌లో 22.79 ఎకరాలు, పుప్పాలగూడలో 94.56 ఎకరాలు, ఖానామెట్‌లో 9 ప్లాట్లు, పుప్పాలగూడలో 26 పాట్లు విక్రయించడానికి సిద్ధం చేసింది. మొత్తం 117.35 ఎకరాల అమ్మ‌కానికి సోమవారం టీఎస్ఐఐసీ నోటిఫికేషన్‌ విడుదల చేయబోతుంది.

ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 27న ఖానామెట్‌, అదే నెల 29న పుప్పాలగూడ భూముల ఈ-వేలం నిర్వహించనున్నారు. ఇక హైదరాబాద్ లో భూముల విలువ ఏ రేంజ్ లో ఉందో చెప్పాల్సిన పనిలేదు. కోట్లు కుమ్మరించిన భూములు దొరకడం లేదు. ఇలాంటి క్రమంలో ప్రభుత్వమే తమ భూములను అమ్ముతుంటే బడా సంస్థలు భూములను దక్కించుకోవడానికి కోట్లతో వస్తున్నారు. మరి ఈ రెండో విడత అమ్మకాల ద్వారా తెలంగాణ సర్కార్ కు ఎన్ని కోట్ల ఆదాయం వస్తుందో చూడాలి.