పూనకాలు తెప్పిస్తున్న ‘BRO’ లుక్

‘BRO’ లుక్ మెగా అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కలయికలో సముద్రఖని డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘BRO’ . తమిళ చిత్రం వినోదయ సీతమ్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా , థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దేవుడి పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడిగా నటిస్తున్నారు.

జులై 28న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ ఫై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఈరోజు సోమవారం ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి అభిమానుల్లో సంబరాలు నింపారు. ఈ లుక్ లో పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ తమదైన స్టైల్తో దర్శనమిచ్చారు. ముఖ్యంగా పవర్ స్టార్ బైక్ మీద కాలు వేసి ఎంతో గ్రేస్గా లుక్కిచ్చాడు. అతడి వెనకాలే సుప్రీమ్ హీరో పద్దతిగా నిల్చుని ఉన్నాడు. దీంతో ఈ పోస్టర్కు భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది.

ప్రియా ప్రకాష్ వారియర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, రోహిణి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, రాజా చెంబోలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ కామెడీ-డ్రామాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది.