బల్గేరియాలో బస్సు దగ్ధం.. 45 మంది దుర్మరణం

సోఫియా నుంచి టూరిస్టులతో వెళుతున్న బస్సు

సోఫియా: యూరప్ దేశం బల్గేరియాలో ఓ లగ్జరీ బస్సు మంటల్లో చిక్కుకున్న ఘటనలో 45 మంది దుర్మరణం అయ్యారు. ఈ బస్సు బల్గేరియా రాజధాని సోఫియా నుంచి టూరిస్టులతో వెళుతుండగా మంటల్లో చిక్కుకుంది. ప్రయాణిస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దివ్యవధిలోనే బస్సు కాలిపోయింది.

ఈ ఘటనలో 45 మంది మరణించగా, ఏడుగురు గాయాలతో బయటపడ్డారు. చనిపోయిన వారిలో 12 మంది చిన్నారులు ఉండడం అందరినీ కలచివేసింది. మృతదేహాలు ఏమాత్రం గుర్తించలేని విధంగా బూడిదగా మారాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/