పవన్ – బోయపాటి కాంబో లో మూవీ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – బోయపాటి శ్రీను కాంబో లో సినిమా వస్తే బాగుండని అభిమానులు ఎప్పటి నుండి కోరుకుంటున్నారు. కానీ ఆ కాంబో మాత్రం సెట్ కావడం లేదు. రీసెంట్ గా బోయపాటి ..బాలయ్య తో చేసిన అఖండ సినిమా భారీ విజయం సాధించడం తో..పవన్ – బోయపాటి కాంబో సెట్ అయ్యిందనే వార్తలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

ప్రస్తుతం బోయపాటి..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతున్నాడనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ లోపు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయనున్నారనే తాజా వార్త వచ్చి వైరల్ అవుతోంది. పవన్ పవర్ కు, బోయపాటి యాక్షన్ తోడైతే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామే అంటున్నారు అభిమానులు. అయితే, ఈ కాంబినేషనే సెట్ అవ్వాలి. ప్రస్తుతం పవన్ ఓ వైపు రాజకీయాలలో బిజీగా ఉంటునే ఒప్పుకున్నా సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం సినిమాలన్నీ పూర్తి కావాలంటే మరో ఏడాది అవుతుంది. ఆ తర్వాత ఎన్నికల్లో బిజీ గా ఉండనున్నారు. మరి బోయపాటి తో సినిమా అంటే వర్క్ అవుట్ తుందో లేదో చూడాలి.