సనత్ నగర్ లో దారుణం : బాలుడిని హత్య చేసిన హిజ్రా

boy-murdered-brutally-in-sanath-nagar

హైదరాబాద్ లోని సనత్ నగర్ లో అమావాస్య రోజున బాలుడ్ని హత్య చేయడం సంచలనంగా మారింది. ముందుగా నరబలి అని ప్రచారం జరిగిన..చివరకు ఇది ఆర్ధిక లావాదేవీల కారణంగా హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. అల్లాదున్‌ కోటిలో నివసించే వసీంఖాన్‌(అబ్దుల్‌ వహీద్‌ తండ్రి)… చిట్టీల వ్యాపారం నిర్వహించే హిజ్రా ఫిజాఖాన్‌ వద్ద చిట్టీలు వేశాడట. అయితే ఆ డబ్బును సదరు హిజ్రా ఇవ్వకపోవడంతో వారిద్దరి మధ్య గురువారం గొడవ జరిగింది. ఇదే క్రమంలో గురువారం సాయంత్రం నుండి వసీంఖాన్‌ కొడుకు అబ్దుల్‌ వహీద్‌ (8) కనిపించకుండాపోయాడు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన తల్లిదండ్రులు సనత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే రాత్రి 8.30 గంటలకు బకెట్‌లో కుక్కి ఉన్న బాలుడి మృతదేహాన్ని జింకలవాడ నాలాలో స్థానికులు గుర్తించారు. దీంతో అక్కడికిచేరుకున్న పోలీసులు మృతదేహాన్ని నాలా నుంచి వెలికితీశారు.

నిన్న సాయంత్రం వసీంఖాన్‌ కుమారుడిని నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి, ప్లాస్టిక్‌ సంచిలో తీసుకుని ఫిజాఖాన్‌ ఇంటికి తీసుకెళ్లినట్లు సీసీ ఫుటేజ్ లో పోలీసులు గుర్తించారు. అబ్దుల్‌ వహీద్‌ ను హత్య చేసింది హిజ్రా ఫిజాఖాన్‌ అని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నలుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరోపక్క హిజ్రా ఇంటిని స్థానికులు పూర్తిగా ధ్వంసం చేశారు.