అమరావతిలో మంత్రి బొత్స పర్యటన

ఆగిపోయిన నిర్మాణ పనులను పరిశీలించిన బొత్స

botsa satyanarayana
botsa satyanarayana

అమరావతి: ఏపి రాజధాని అమరావతిలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా ఆయన అమరావతిలో ఆగిపోయిన నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు. ఆలిండియా సర్వీస్ క్వార్టర్స్, ఎన్జీవో, హెచ్ఓడీల క్వార్టర్స్ ను పరిశీలించారు. ఆయన వెంట సీఆర్డీఏ అధికారులు ఉన్నారు. సీఆర్డీఏ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో కూడా ఆయన సమావేశమయ్యారు. పలు విషయాలపై వారితో చర్చించారు. మరోవైపు, బొత్స పర్యటనపై అమరాతి రైతుల్లో ఆసక్తి నెలకొంది. రాజధానిగా అమరావతినే కొనసాగించే అవకాశం ఉందా? అని చర్చించుకుంటున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/