ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

Fire breaks
Fire breaks

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని సివిల్ లైన్స్ లోని ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట కార్యాలయంలో సోమవారం ఉదయం దురదృష్టశాత్తు మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహటిన సంఘటనాస్థలానికి చేరుకున్నారు. భారీగా ఎగిసి పడుతున్న అగ్ని జ్వాలలను ఎనిమిది ఫైర్ ఇంజన్లతో ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/