బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి వి.శ్రీనివాస ప్రసాద్ కున్నుమూత

లోక్ సభ ఎన్నికల వేళ బిజెపి పార్టీ లో విషాదం నెలకొంది. బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి వి.శ్రీనివాస ప్రసాద్ (76) కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన సోమవారం తెల్లవారుజామున తదిశ్వాస విడిచారు. శ్రీనివాస ప్రసాద్‌కు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. చామనగర్‌ నియోజకవర్గం నుంచి శ్రీనివాస ప్రసాద్ ఆరు సార్లు ఎంపీగా విజయం సాధించారు. మైసూరు జిల్లాలోని నంజన్‌గుడ్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

1976లో బీజేపీలో చేరిన శ్రీనివాస ప్రసాద్ 1979లో కాంగ్రెస్‌లో చేరారు. బీజేపీలో చేరడానికి ముందు కొంతకాలం పాటు జేడీయూ, జేడీఎస్, సమతా పార్టీల్లోనూ వివిధ హోదాల్లో పనిచేశారు. 1999 -2004 వరకు అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార పంపిణీ శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి 2013లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2016లో మళ్లీ కమలం గూటికి చేరి 2019లో చామరాజనగర్‌ నుంచి ఎంపీగా గెలుపొందారు.