బండి సంజయ్ పాదయాత్రపై హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్‌

bjp-filed-petition-on-bandi-sanjay-padayatra

హైదరాబాద్‌ః బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ఆపవద్దని పోలీసులను ఆదేశించాలని కమలం పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. పోలీసుల ఆదేశాలను సవాల్ చేస్తూ బిజెపి తరఫున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి.. హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. పిటిషన్​పై ఈ మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు అత్యవసర విచారణ చేపట్టేందుకు హైకోర్టు అంగీకరించింది.

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర నిలిపివేయాలని ఆదేశిస్తూ నిన్న వరంగల్ కమిషనరేట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసుల ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్ లో భాజపా పేర్కొంది. ప్రభుత్వ, రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు యాత్రను ఆపేందుకు నోటీసులు ఇచ్చారని పిటిషన్​లో ఆరోపించారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు రాజకీయ పార్టీలు పాదయాత్రలు చేయడం దేశంలో అత్యంత సాధారణమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు విపక్షాల నిర్మాణాత్మక విమర్శలను స్వీకరించాలన్నారు. కానీ ప్రభుత్వ ప్రోత్బలంతో పోలీసులు పాదయాత్ర ఆపివేయడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు డీజీపీ మౌఖికంగా అనుమతిచ్చారని పిటిషన్​లో పేర్కొన్నారు. యాత్రకు ఇప్పటివరకు పోలీసులు యాత్రకు భద్రత కల్పించడంతో పాటు అన్ని విధాల సహకరించడమే అనుమతి ఉందనడానికి నిదర్శనం అని పేర్కొన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/