మంత్రి కెటిఆర్‌కు ప్రముఖుల శుభాకాంక్షలు

నేడు కెటిఆర్‌ పుట్టిన రోజు

KTR
KTR

హైదరాబాద్‌: ఈరోజు తెలంగాణ మున్సిపల్‌, ఐటీ మంత్రి కెటిఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్ డే డియర్ తారక్. ప్రజలకు సేవ చేసేందుకు మరింత శక్తితో ముందుకు సాగాలి’ అని మెగాస్టార్ చిరంజీవి, శుభాకాంక్షలు తెలిపారు. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు కెటిఆర్. నీవు ఆయురారోగ్యాలతో కలకాలం ఆనందంగా ఉండాలి’ అని మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేయగా, ‘బావా… చాలా కృతజ్ఞతలు’ అని కెటిఆర్ స్పందించారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తన శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రజా సేవలో మరిన్ని సంవత్సరాలు కెటిఆర్ కొనసాగాలని, ఇంకా పెద్ద పదవులను చేపట్టాలని ఆకాంక్షించారు. కాగా కెటిఆర్‌కు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలుపుతున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/