కళ్యాణ్ రామ్ బింబిసార టీజర్ రిలీజ్

కళ్యాణ్ రామ్ బింబిసార టీజర్ రిలీజ్

హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న కళ్యాణ్ రామ్..ప్రస్తుతం బింబిసార అనే హిస్టారికల్ సినిమాతో అలరించడానికి సిద్దమవుతున్నాడు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతే బింబిసారుడు. ఆయన కథతోనే ఈ సినిమా తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మిస్తున్నాడు. శ్రీ వశిష్ట్ దర్శకత్వంలో రూపొందుతోన్న సోషియో ఫాంటసీ మూవీ గా రానున్న ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు.

‘ఓ సమూహం తాలూకు ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే.. కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తలవంచి బానిసలైతే, ఇందరి భయాన్ని చూస్తూ పొగరుతో ఓ రాజ్యం మీసం మెలేసింది. అదే త్రిగర్తల సామ్రాజ్యపు నెత్తుటి సంతకం. బింబిసారుడి ఏకఛత్రాధిపత్యం’ అనే వాయిస్ తో ఆకట్టుకునే విజువల్స్ తో ఈ టీజర్ ను కట్ చేశారు. అలాగే.. ఈ టీజర్ చివరిలో కళ్యాణ్ రామ్ వర్తమానంలోని కేరక్టర్ ను కూడా రివీల్ చేశారు. ఆ మేకోవర్ కూడా ఆకట్టుకుంటోంది. ‘మగధీర’ తరహాలో ఓ పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ తో ఈ సినిమా తెరకెక్కిందని అర్ధమవుతోంది. మరి ఈ మూవీ కళ్యాణ్ రామ్ కు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.