నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

హైదరాబాద్: నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, జనగామ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.
ఒడిశా, దాని పరిసర ప్రాంతాలు, ఝార్ఖండ్ ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుండడంతోపాటు, రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ద్రోణి ఏర్పడడమే ఇందుకు కారణమని వివరించారు. కాగా, నిన్న కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/