బిగ్ బాస్ వేదిక ఫై రామ్ చరణ్ సందడి

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండు వారాలు పూర్తి చేసుకొని మూడో వారంలోకి ఎంట్రీ ఇస్తుంది. ఇదిలా ఉంటె బిగ్ బాస్ వేదిక ఫై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సందడి చేసాడు. కేవలం రామ్ చరణ్ మాత్రమే కాదు నితిన్ , తమన్నా , నాభ నటేష్ లు కూడా చేసినట్లు తెలుస్తుంది. రీసెంట్ గా రామ్ చరణ్ డిస్నీ హాట్ స్టార్ కు బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చరణ్ బిగ్ బాస్ వేదిక ఫై నాగ్ తో కలిసి మెరవనున్నారు.

ఇక నితిన్ నటించిన మాస్ట్రో మూవీ శుక్రవారం డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యి సక్సెస్ సాధించింది. ఈ క్రమంలో మాస్ట్రో యూనిట్ కూడా బిగ్ బాస్ వేదిక ను పంచుకున్నారు. మరి వీరంతా వేదిక వరకే పరిమితం అయ్యారా..లేక హౌస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చారా అనేది తెలియాల్సి ఉంది. మరి ఈరోజు జరగబోయే బిగ్ బాస్ ఎపిసోడ్ హౌస్ సభ్యులతో పాటు ప్రేక్షకులకు మంచి జోష్ ఇవ్వబోతుంది.

#Maestro celebrates the success with #BiggBoss tonight along with @AlwaysRamcharan who marks his debut as the Official Ambassador for @DisneyPlusHs Great fun shooting for this special show! 😎😎@IamNagarjuna @Tamannaahspeaks @NabhaNatesh

#BiggBossTelugu5@StarMaapic.twitter.com/jwWLl8OxMU— nithiin (@actor_nithiin) September 18, 2021