నల్గొండలో రోడ్డు ప్రమాదం..ఐదుగురి మృతి

ధైర్యపురి తండా వద్ద ఘటన

road accident
road accident

నల్గొండ: హైదరాబాద్‌- సాగర్‌ హైవేపై ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ నుంచి మల్లేపల్లి వెళ్తున్న కారు నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండలం ధైర్యపురి తండా వద్ద అదుపు తప్పి వాటర్ పైప్‌లైన్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఐదుగురు మృతి చెందారు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులను హైదరాబాద్ వాసులుగా గుర్తించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/