ఇది సరియైన సమయం కాదు: ఐరాస

డబ్ల్యూహెచ్‌వో కి అమెరికా నిధులు నిలిపివేయడంపై స్పందించిన ఐరాస

antonio guterres
antonio guterres

న్యూయార్క్‌: అమెరికా నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కు అందుతున్న నిధులను నిలిపివేస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. కరోనా గురించి డబ్ల్యూహెచ్‌వో చెప్పిన ప్రతి విషయం తప్పేనని ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్‌, కరోన వైరస్‌ తీవ్రతను ఎందుకు అంచని వేయలేకపోయారని మండిపడ్డారు. ప్రతి సంవత్సరం అమెరికా నుండి డబ్ల్యూహెచ్‌వో కి సుమారు 400 నుండి 500 మిలియన్‌ డాలర్లు అందుతుంటే.. చైనా నుంచి 40 మిలియన్‌డాలర్లు మాత్రమే అందుతున్నాని ట్రంప్‌ పేర్కోన్నారు. అయితే డబ్ల్యూహెచ్‌వో కి నిధులు నిలిపివేయడానికి ఇది సరియైన సమయం కాదని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్‌ అన్నారు. ట్రంప్‌ ఈ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని అన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/