బిగ్ బాస్ 5 : ఈ ఇద్దరిలో ఎవరొకరు హౌస్ ను విడిచిపెట్టబోతున్నారు

బిగ్ బాస్ 5 మొదలై అప్పుడే వారం కావొస్తుంది..మొత్తం 19 మంది సభ్యులతో బిగ్ బాస్ మొదలవ్వగా..మొదటివారం ఒకరు హౌస్ ను విడిచిపెట్టబోతున్నారు. మొదటివారానికి గాను ఆరుగురు సభ్యులు నామినేషన్లో ఉన్నారు. యాంకర్ రవి , కాజల్ , మానస్ , జాస్వంత్ , హమీద , సరియు లు ఉండగా వీరిలో ఒకరు ఈ వారం ఇంటికి వెళ్లబోతున్నారు.

ప్రస్తుతం పోల్స్ బట్టి చూస్తే యాంకర్ రవి టాప్ ప్లేస్ లో ఉండగా రెండో స్థానంలో మానస్ , మూడో స్థానంలో జాస్వంత్ ఉన్నారు. ఇక మిగిలిన స్థానాల్లో కాజల్ , హమీద , సరియు లు ఉన్నారు. ఈ ముగ్గుర్లో కాజల్ కు బెటర్ ఓట్లు పడినట్లు సమాచారం. దీంతో హమీదా కానీ, సరయు కానీ ఈ వారం ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉందని టాక్.

ఇక రాత్రి ఎపిసోడ్ లో వినాయకచవితి సంబరాలను సభ్యులు ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. ఆ తర్వాత కంటెస్టెంట్లు అందరినీ కూర్చోబెట్టిన బిగ్ బాస్.. ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్కులో ఎవరు ఉత్తమ ప్రదర్శన ఇచ్చారు.. ఎవరు చెత్తగా ఆడారు అని నిర్ణయించుకుని ఒక్కో పేరు చెప్పమని ఆదేశించాడు. దీంతో చాలా మంది బెస్ట్ పెర్ఫార్మర్‌గా విశ్వకు ఓట్ చేయడంతో అతడినే ఎంచుకున్నారు. అలాగే, వరస్ట్ పెర్ఫార్మర్‌గా జస్వంత్‌ను ఎంపిక చేసుకున్నారు. దీంతో తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ అతడిని జైలులో పెట్టమని కెప్టెన్ సిరి హన్మంత్‌ను ఆదేశించాడు.