మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి వరుస షాకులు

అధికారం చేతిలో ఉంటె ఎన్ని ఆటలైనా ఆడొచ్చు..అదే అధికారం చైజారితే అంతే సంగతి. ప్రస్తుతం బిఆర్ఎస్ నేతల పరిస్థితి అలాగే ఉంది. పదేళ్ల పాటు అధికారంలో వారు ఆడిందే ఆట..చెప్పెందే వేదం…చేసిందే పని అన్నట్లు సాగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడం తో వారి ఆటలకు ఫుల్ స్టాప్ పడింది. అంతే కాదు ఇప్పటివరకు పన్నులు కట్టకుండా ఉన్న నేతలకు నోటీసులు జారీ చేయడం చేస్తున్నారు అధికారులు.

ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి వరుస షాకులు తగులుతున్నాయి. సోమవారం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.20 కోట్ల రుణం తీసుకుని నిర్మించిన జీవన్ రెడ్డి మాల్ మల్టీప్లెక్స్ సంబంధించిన రుణం చెల్లింపులో నిర్లక్ష్యంపై నోటీసులు జారీ చేసింది. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున రుణానికి గ్యారెంటీగా ఉన్న మరో నలుగురికి సైతం ఎస్ఎస్సి నోటీసులు జారీ చేయడం గమనార్హం. అంతే కాదు ఈ నెలలోనే ఆర్టీసీ తమకు రావాల్సిన లీజు బకాయిల కోసం ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బకాయిలు కట్టాలని లేకపోతే సీజ్ చేస్తామని ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే.

విద్యుత్ శాఖ అధికారులు కూడా జీవన్ రెడ్డి మాల్ నుంచి తమకు రావాల్సిన రెండున్నర కోట్ల విద్యుత్ బకాయిల కోసం ఏకంగా కరెంటు సరఫరా నిలుపుదల చేసి షాక్ ఇచ్చారు. ఇక ప్రస్తుత ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అంకాపూర్ లో జీవన్ రెడ్డు కి సంబదించిన కంకర క్వారీని మైనింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. మొత్తం మీద జీవన్ రెడ్డి వరుస షాకులు తగులుతుండడం తో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తుంది.