20న అమెరికా 46వ అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం

ధృవీక‌రించిన అమెరికా కాంగ్రెస్

Biden was sworn in as President of the US on January 20
Biden was sworn in as President of the US on January 20

Washington: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌ గెలిచినట్టు అమెరికా కాంగ్రెస్ ధృవీకరించింది. విజయానికి కావాల్సిన 270 ఓట్లను బైడెన్ సాధించినట్టు కాంగ్రెస్ పేర్కొంది.

ఉపాధ్యక్షుడు పెన్ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కాంగ్రెస్ ఏక గ్రీవంగా జో బైడ‌న్ త‌దుప‌రి అధ్య‌క్ష‌డంటూ తీర్మానించింది.. ఈ స‌మావేశం ప్రారంభ‌మైన వెంట‌నే క్యాపిట‌ల్ భ‌వ‌న‌పై ట్రంప్ మద్దతుదారుల దాడి చేసి విధ్వ‌సం సృష్టించారు..

స‌భ జ‌ర‌గ‌కుండా అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించారు.. ఈ సంద‌ర్భంగా పోలీసులు జ‌రిపిన కాల్పుల‌లో ఒక మ‌హిళ మ‌ర‌ణించ‌గా, తొక్కిస‌లాట‌లో మ‌రో ముగ్గురు మృతి చెందారు.

ఆ సమయంలో అమెరికా చట్టసభల్లో ఉన్న సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు లోనయ్యారు. అమెరికా ఎగువ, దిగు సభల సమావేశాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఈ ఘ‌ర్ష‌ణ స‌మ‌యంలో స‌భ‌ను కొంత సేపు పెన్ వాయిదా వేశారు. అయితే..పరిస్థితి అదుపులోకి వచ్చాక అమెరికా చట్టసభ సభ్యులు మరోసారి సమావేశమై బెడెన్ విజయాన్ని ధృవీకరించారు.

తిరిగి స‌మావేశ‌మైన స‌మ‌యంలో బైడెన్ విజయంపై కొందరు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ మాత్రం బెడెన్‌దే విజయమంటూ ప్రకటించింది.

అవాంతరాలన్నీ తొలగిపోవడంతో జో బెడెన్ జనవరి 20న అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

అధికార పీఠం వదిలిలేది లేదంటూ కల్లోలానికి కారణం అవుతున్న ట్రంప్‌కు ఈ పరిణామంతో భారీ షాక్ తగిలినట్టైంది. బైడెన్ వైట్ హౌస్‌కీ.. ట్రంప్ సొంత హౌస్‌కు వెళ్లడం ఖాయమైపోయింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/