డొనాల్డ్ ట్రంప్‌కు అరెస్ట్‌ వారెం‍ట్‌

ఇరాన్‌ సైనికాధికారి హత్య కేసులో అరెస్ట్‌ వారెం‍ట్‌ జారీ చేసిన బాగ్దాద్

Baghdad issues arrest warrant for Trump in Iranian military assassination case
Baghdad issues arrest warrant for Trump in Iranian military assassination case

Baghdad :   అమెరికా అధ్యక్ష పదవికి గుడ్‌బై చెప్పనున్న నేపద్యంలో డొనాల్డ్ ట్రంప్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఇరాన్‌ సైనికాధికారిని హత్య చేసిన కేసులో ట్రంప్ కు అరెస్ట్‌ వారెం‍ట్‌ జారీ చేసింది బాగ్దాద్ కోర్టు.

జనరల్ ఖాసిమ్ సులేమాని, అబూ మహదీ అల్ ముహండిస్‌లను హతమార్చిన డ్రోన్‌దాడిపై దర్యాప్తు చేయాల్సిందిగా బాగ్దాద్ కోర్టు జడ్జ్‌ గురువారం ఆదేశించారు.

అబూమహదీ అల్ ముహండిస్ కుటుంబం నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేసిన అనంతరం వారెంట్ జారీ చేసే నిర్ణయం జరిగిందని, హత్యలపై దర్యాప్తు కొనసాగుతోందని సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ వెల్లడించింది.

బాగ్దాద్‌లో గత ఏడాది జనవరి 3న వైమానిక దాడిలో జనరల్‌ ఖాసిం సులేమానిని హతమార్చిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే ఈ కేసులో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తోపాటు మరో 47 మంది ఇతర అమెరికన్ అధికారులను అదుపులోకి తీసుకునేందుకు సహకరించలని ఇంటర్‌పోల్‌ను కోరింది.

ట్రంప్‌ అధ్యక్ష పదవీకాలం ముగిసినా ట్రంప్‌ను వదిలేది లేదని ఇరాన్‌ ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/