13 వరకూ వరవరరావు ఆస్పత్రిలో…

చికిత్స పొందేందుకు బాంబే హైకోర్టు అనుమతి

Varavara Rao in hospital until 13
Varavara Rao in hospital until 13

Mumbai: ‘విరసం’ నేత వరవరరావు ఈ నెల 13 వరకు ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు బాంబే హైకోర్టు అనుమతి నిచ్చింది.

అనారోగ్యంతో బాధపడుతున్న 81 సంవత్సరాల వరవరావును గతేడాది నవంబరులో నానావతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 13 వరకు ఆయన అక్కడే చికిత్స పొందవచ్చని జస్టిస్ ఎస్ షిండే, జస్టిస్ ఎంఎస్ కార్నిక్‌లతో కూడిన ధర్మాసనం తాజాగా పేర్కొంది.

తన భర్తకు బెయిలు ఇప్పించాలంటూ వరవరరావు భార్య హేమలత దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌ను 13న విచారించనున్నట్టు తెలిపింది.

కాగా, వరవరరావు ఆరోగ్యం కొంత మెరుగుపడిందని మహారాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/