విశ్వాసంలో ధైర్యంగా ..

‘అంతర్వాణి’ బైబిల్‌ కథలు

Jesus
Jesus

దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపమునకు విముఖుడవై యుండకుము. నా మనవి ఆలకించి నాకుత్తరమిమ్ము. శత్రువుల శబ్దమునుబట్టియు నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను.

వారు నావిూద దోషము మోపుచున్నారు.. (కీర్తన 55:1)..నిత్యం మనల్ని భయం వెంటాడుతున్నది. అవును మనకు అతిప్రియమైనవారే మనల్ని భయభీతులకు గురిచేస్తుంటారు.

మనపై నిందలు మోపుతుంటారు. ‘క్రీసుయేసునందు సద్భక్తితో బ్రదుకనుద్దేశించువారందరు హింసపొందుదురు (2తిమోతి 3:12). దేవ్ఞనియందు భయభక్తులతో జీవించాలని ఉద్దేశించినవారు హింసపొందుతారు.

ఎందుకంటే దేనికీ రాజీపడరు. సత్యం, నిజాయితీ, ప్రేమ, దయతో ప్రవర్తించాలని కోరుకుంటారు. ఈ గుణాలు వ్యక్తిగతంగా మనకై మనం పొందిన నీతి కాదు. దేవ్ఞడి మహాకృపను బట్టి మనం పొందిన ధన్యత, ఆయన నీతి వల్లనే మనకు లభించిన భాగ్యం.

దేవుడు మనల్ని ఆకర్షించుకోకపోతే మనం దేవుడిని సేవించలేం. ఆయనను మన సొంత రక్షకుడిగా అంగీకరించలేం.

సరే దేవుడిని విశ్వసించిన తర్వాత మనల్ని దేవుడి పరిశుద్ధత, ప్రేమ, ఆయన ఆత్మప్రేరణ వెంటాడుతూనే తద్వారా మనం దేవుడి అడుగుజాడల్లో పయనిస్తున్నాం.

అందుకే దేనికీ రాజపడకుండా ముందుకు సాగిపోతుంటారు. అయితే మనం దేవుడిని పెనవేసుకుని, ఆయనను వెంబడించడం ఏమాత్రం అపవాదికి ఇష్టం ఉండదు. వాడు ఎప్పుడూ దేవుడితో మనకున్న అనుబంధాన్ని దూరం చేయాలని ప్రయత్నిస్తుంటాడు.

అందుకు మనకు అత్యంత ప్రియమైనవారిని, సమీపంగా ఉన్నవారినే అపవాది వాడకుంటాడు. మనల్ని హింసిం చేలా, బాధించేలా, అపార్థం చేసుకుని, శత్రువుగా మార్చేందుకు కృషి చేస్తుంటాడు. ఈ ప్రయత్నంలో భాగమే మనకు శ్రమలు, హింసలు అనేవి వస్తుంటాయి.

అయితే కొందరు దేవుడు ఎందుకని వీటి నుంచి మనల్ని దూరం చేయడు, ఆయనకు ఆ శక్తి లేదా అని మూర్ఖంగా ప్రశ్నిస్తుంటారు.

ఏ క్రైస్తవుడు అయితే నాకు కష్టాలు, బాధలు, హింసలు లేవని చెబుతున్నాడో, దేవుడు నన్ను అన్నివిధాలుగా ఆశీర్వదించాడు అని అంటాడో ఆ విశ్వాసియొక్క విశ్వాసాన్ని అనుమానించాల్సిందే.

ఎందుకంటే సర్వాధికారి దేవాదిదేవుడే ఈలోకం జీవించినంతకాలం శ్రమలతో జీవించాడు. యూదులు, పరిసయ్యులు, యాజకులు ఆయనను హింసించారు.

‘ఈలోకములో విూకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను (యోహాను 17:33).ఈ మాట ప్రభువే స్వయంగా చెప్పాడు.


మరి శ్రమలు లేవని చెప్పుకుంటున్నాం అంటే అపవాదితో రాజీపడి జీవిస్తున్నామని అర్థం. కాబట్టి శ్రమలు, హింసలు వంటివాటి గుండా పయనిస్తున్న విశ్వాసులు అధైర్యపడకుండా మరింత పట్టుదలతో ప్రభువు సన్నిధిలో ప్రార్థనలో పోరాడేందుకు ప్రయత్నించండి.

ఎంత ఎక్కువగా సాధ్యమైతే అంత ఎక్కువగా ప్రార్థన గడిపేందుకు ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఒక్క ప్రార్థన ద్వారా తప్ప మనం దేనివల్ల విజయాన్ని పొందలేం.

ప్రార్థనే మన ఆయుధం. యేసుప్రభువు కూడా రాత్రంతా ప్రార్థనలో గడిపి, తనకు అప్పగించిన పరిచర్యను సంపూర్ణంగా నెరవేర్చి, దేవుడిని మహిమపరిచాడు.

మనం ఆయన అడుగుజాడల్లో పయనిద్దాం. అందుకు దేవుడు సాయం చేయునుగాక.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/