షిర్డీ యాత్ర -ఆధ్యాత్మిక చింతన

ఆధ్యాత్మిక చింతన

Shirdi Sai Baba
Shirdi Sai Baba

సాయిబాబాను గూర్చి తెలిసిన వారందరూ షిర్టీ యాత్ర చేసి ఆయనను దర్శి ద్దామనుకునే వారు చాలా మంది. కొంత మందికి యాత్ర చేసి, ఆయనను దర్శించుట జరు గుతుంది. కొందరు సాయిబాబాను దర్శిద్దామనే కోరికతోనే కాక తమను ఆపద నుండి కాపాడితే షిర్టీయాత్రచేసి సాయిని దర్శిద్దామని మొక్కుకుంటారుకూడా. ఒకసారి పూనాలో ప్లేగువ్యాధి చెలరేగింది.

ఆర్‌.కె.దూబే అనే ఒక వ్యక్తి తనను కాపాడమని, షిరిడీకి వస్తా నని మొక్కుకుంటాడు. అయితే అతడు మనసు మార్చుకుని షిరిడీకి వెళ్ల టానికి బదులుగా, అత్తవారింటికి వెళతాడు. అక్కడ అతని కూతురు తీవ్ర అనారోగ్యానికి గురయింది. ఇంకా, భార్య కూడా అనారోగ్యం పాలయింది.

అతనికి తను చేసిన వాగ్దానం గుర్తుకు వచ్చింది. ఆ రాత్రే సాయిబాబా దూబే కలలో కనిపించి మొక్కులు చెల్లించితీరాలి. లేకుంటే ఇటువంటి బాధలు తప్పవు అన్నారు. అది కేవలం స్వప్నంకాదు. ఆ స్వప్పంలోనే దూబే భార్య నుదుట వీబూతిపెట్టారు. దూబే నిద్రలేచిచూచాడు. అతని భార్య నుదిటి మీద వీబూతి ఉన్నది. అతని భార్య ఆరోగ్యం చక్కబడ్డది. ఇక షిరిడీకి వెళ్లి సాయిని దర్శించాడు దూబే. అప్పుడు షిరిడీలో సాయి ఈ విషయాన్ని గుర్తుచేశారు.

అతడు (దూబే) రెండు విష యాలు గ్రహించారు. సాయి స్వప్నంలో కన్పించడం భ్రమకాదు అని, షిరిడీ యాత్ర చేస్తానని మొక్కుకున్న తరువాత యాత్ర చేసి తీరాలని. డాక్డర్‌ కేశవ్‌ యం.గవాన్‌కర్‌ కుటుంబం సాయిబాబా భక్తులు. గవాన్‌కర్‌కు బాల్యంలో బాగా జబ్బు చేసింది. మంత్రం, యంత్రం, తంత్రం, వైద్యం ఏదీ పనికిరాలేదు. రెండునెలల ఆ బాలుడు స్పృహలో లేదు.

ఎవరో వారిని సాయిని పూజింపమన్నారు. ఆ కుటుంబం సాయిని పూజించింది. షిరిడీ యాత్ర చేస్తానని మొక్కుకున్నారు కూడా. ఆ వ్యాధి తగ్గింది. గవాన్‌కర్‌ మామూలు మనిషి అయ్యాడు. అయితే ఆ కుటుంబం, షిర్టి యాత్రను చేయకుండా వాయిదావేసుకుంటూ వస్తోంది. అయిదేండ్ల పాటు ఆ కుటుంబంవారు షిరిడీ యాత్రను వాయిదా వేసుకున్నారు.

అనంతరం షిరిడీ యాత్ర చేసింది ఆ కుటుంబం. సాయిబాబాకు వారు పాలకోవా బిల్లలు సమర్పించారు. సాయిబాబా ఆ కోవా బిల్లల్లో అయిందింటిని తీసుకోకుండా ఇచ్చివేశారు. మిగిలిన కోవాబిల్లలను సాయి తీసుకున్నారు. అలా అయిదింటిని తీసుకోకపోవటానికి కారణం అడిగారు సాయిబాబాను.

‘నన్ను అయిదేండ్లపాటు ఆకలితో ఉంచారు కదా! దానికి శిక్షలే! అన్నారు. సాయిలాంటి దైవం మొక్కుకున్న తన భక్తులు వేగిరంగా తనను దర్శించాలనుకుంటాడు. భక్తులు తనను దర్శిస్తే తన కడుపు అంటే దైవం కడుపునిండినట్లే. అయితే సాయిబాబాను కాని ఏ దైవాన్ని కాని మొక్కుకోకుండా ఎప్పుడైనా దర్శించవచ్చును.

నీ కడకు నీవే రప్పించుకో, ఆపద మొక్కులు మాచే ఇప్పించుకో అంటారు ఘంటసాల ఒక లలిత గీతంలో. అయితే షిర్డీ యాత్ర చేద్దామని బలవత్తరమైన కోర్కె ఉంటే
సాయి కాదనడు.